కోవిడ్ టీకాలు వృధా.. టాప్‌లో తమిళనాడు, హర్యానా

హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్‌ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, హర్యానాలు టాప్‌లో నిలిచాయి. తమిళనాడులో 12.4 శాతం, హర్యానాలో 10 శాతం, బీహార్‌లో 8.1 శాతం వ్యాక్సిన్ వృధా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అయిదు లక్షల డోసుల టీకాలను వృధా చేసినట్లు కేంద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక టీకాలు వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ(7), ఏపీ(7.3), పంజాబ్(8), అస్సాం(7.3), మణిపూర్(7.2)లు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుత రికార్డును అందుకున్న రాష్ట్రాల్లో గోవా, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్, కేరళ, అండమాన్ నికోబార్, మీజోరం ఉన్నాయి. వ్యాక్సిన్లు వృధా కావడం ఆందోళన కలిగిస్తున్న నేషనల్ హెల్త్ అధారిటీ సీఈవో డాక్టర్ రామ్ సేవక్ శర్మ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

