గురువారం 26 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 19:28:03

త‌మిళ‌నాడులో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌

త‌మిళ‌నాడులో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్‌

చెన్నై: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌రో నెల రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది. అయితే ఈసారి అద‌నంగా మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తూ లాక్‌డౌన్‌ను పొడిగించిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు స‌ర్కారు ఒక ప్ర‌క‌టన విడుదల చేసింది. 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల విద్యార్థుల కోసం పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, అదేవిధంగా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇత‌ర విద్యాసంస్థ‌ల‌ను న‌వంబ‌ర్ 16 నుంచి తెరుచుకోవ‌చ్చ‌ని త‌మిళ‌నాడు స‌ర్కారు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. మ‌రో వైపు సినిమా థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌ను కూడా న‌వంబ‌ర్ 10వ తేదీ నుంచి 50 శాతం కెపాసిటీతో తెరుచుకునేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.