Tamil Nadu Governor : సెక్యులరిజం (Secularism) అనేది యూరోపియన్ దేశాల (Europion countries) కాన్సెప్ట్ అని, భారత్లో దాని అవసరం అసలే లేదని తమిళనాడు గవర్నర్ (Tamil Nadu governor) ఆర్ఎన్ రవి (RN Ravi) అన్నారు. తాజాగా కన్యాకుమారి (Kanyakumari) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సెక్యులరిజంపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయని, వాటిలో సెక్యులరిజానికి తప్పుడు వివరణ ఒకటని చెప్పారు.
వాస్తవానికి సెక్యులరిజం అనేది యూరోపియన్ వారి భావన అని తమిళనాడు గవర్నర్ అన్నారు. నాడు చర్చికి, రాజుకు మధ్య జరిగిన పోరాటం వల్ల సెక్యులరిజం ఉద్భవించిందని చెప్పారు. కానీ భారత్ ఈ ధర్మానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. ఇక్కడ వైరుధ్యాలుండవు కాబట్టి సెక్యులరిజం అవసరం లేదని పేర్కొన్నారు. ‘సెక్యులరిజాన్ని ఐరోపాలోనే ఉండనివ్వండి. భారతదేశంలో దాని అవసరమే లేదు’ అని వ్యాఖ్యానించారు.
1976లో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారని విమర్శించారు. ఎమర్జెన్సీ కాలంలో అభద్రత భావంతో ఉన్న ప్రధాని కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టేందుకే రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని తీసుకొచ్చారని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు.