
చెన్నై: తమిళనాడులో అధికారం కోల్పోయిన అన్నాడీఎంకే పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే మాణిక్కం అన్నాడీఎంకేకు గుడ్‌బై చెప్పారు. అన్నాడీఎంకేను వీడి బీజేపీ గూటికి చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై సమక్షంలో మాణిక్కం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం తిరుప్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నమలై బీజేపీ కండువా కప్పి మాణిక్కంను పార్టీలోకి ఆహ్వానించారు.