వర్ష బాధితులకు ఆహారం తయారీని పర్యవేక్షించిన స్టాలిన్

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వరద ముంపునకు గురైన ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ ప్రజలకు సహాయ సహకారాలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమవుతున్నారు. వర్ష బాధితుల కోసం ఒక కేంద్రంలో ఆహార తయారీని ఆయన సమీక్షించారు. వండిన ఆహారాన్ని రుచి చూశారు. అవసరమైన వారికి పంపిణీ చేస్తామని చెప్పారు. భారీ వర్షాలు ముగిసే వరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఉచితంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తమిళనాడులో 11 బృందాలు, పుదుచ్చేరిలో 2 బృందాలను నియమించినట్లు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ రేఖా నంబియార్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరో 5 బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని రకాల విపత్తులను ఎదుర్కోవడానికి అన్ని బృందాలు తగిన పరికరాలతో సర్వసిద్ధంగా ఉన్నాయని వివరించారు. వరదలకు ప్రభావితం కాని ప్రజలు తమ ఇండ్లలోనే ఉండాలని ఆమె సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

