చెన్నై: రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, ద్విభాషా విధానం, హిందీ విధింపుపై వ్యతిరేకతకు కట్టుబడి ఉంటానన్నదే తన పుట్టినరోజు సందేశమని శనివారం 72వ జన్మదినం జరుపుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
తమిళనాడు ప్రయోజనలాను పరిరక్షించడం, రాష్ట్రంపై హిందీ విధింపును వ్యతిరేకించడం అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తామంటూ పార్టీ కార్యకర్తల చేత ప్రతిజ చేయించారు. ‘తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది’ అంటూ స్టాలిన్ నినదించగా కార్యకర్తలు ఆయనతో గొంతు కలిపారు.