చెన్నై: తమిళనాడులో చెన్నైకి చెందిన నీట్(NEET) అభ్యర్థి జగదీశ్వరన్ .. శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో అటెంప్ట్లోనూ ర్యాంక్ రాకపోవడంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆ కడుపు కోత భరించలేక ఆ మరుసటి రోజే ఆయన తండ్రి సెల్వశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 2022లో జగదీశ్వరన్ 427 మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కానీ నీట్ వైద్య పరీక్షను అతను క్లియర్ చేయలేకపోడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి తన ప్రాణాలను వదిలేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) .. నీట్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎటువంటి ఆత్మహత్య ఆలోచనలకు వెళ్లరాదన్నారు. పరీక్షల్ని ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవాలన్నారు. కొన్ని నెలల్లో రాజకీయా సమీకరణలు మారనున్నాయని, ఆ తర్వాత నీట్ పరీక్షను రద్దు చేయనున్నట్లు ఆయన చెప్పారు. నీట్ పరీక్ష విధానాన్ని వ్యతిరేకంగా యాంటీ నీట్ బిల్లును తమిళనాడు రూపొందించింది. అయితే ఆ బిల్లుపై తాను సంతకం చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్న విషయం తెలిసిందే.