Gold Crown | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్.. కేరళలోని గురువాయూర్ దేవాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గురువాయూర్ దేవాలయానికి బంగారం కిరీటం సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా.
ఆ కిరీటం 32 సావరిన్ల బంగారం తయారు చేసినట్లు తెలుస్తున్నది. భక్తి పూర్వకంగా దుర్గా స్టాలిన్ ఈ కిరీటాన్ని దేవాలయానికి సమర్పించారు. కిరీటంతోపాటు దేవుడికి నిత్య పూజలు చేయడంలో వినియోగించే గంధపు చెక్కలను పొడి చేసే గ్రైండింగ్ మిషన్ కూడా దేవాలయానికి అందజేశారు. ఈ యంత్రం విలువ రూ.2 లక్షలపై మాటే. కాగా, కోయంబత్తూరు కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార వేత్త ఒకరు.. ఈ బంగారం కిరీటాన్ని అందచేశారని సమాచారం.