చెన్నై : ఓ ఏడేళ్ల బుడతడు కరోనా రోగుల పట్ల మానవత్వంతో మెలిగాడు. తాను సైకిల్ కొందామని దాచుకున్న డబ్బును కరోనా రోగుల కోసం ఖర్చు పెట్టాలని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశాడు. మధురైకి చెందిన హరీష్ వర్మన్(7) సైకిల్ కొందామని గత రెండేళ్ల నుంచి డబ్బు జమ చేసుకుంటున్నాడు. కానీ కరోనా రోగులను చూసిన తర్వాత తన వంతు వారికి ఆర్థిక సాయం చేయాలని వర్మన్ నిర్ణయించుకున్నాడు.
దీంతో తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తూ సీఎంకు ఓ లేఖ రాశాడు వర్మన్. కరోనాతో బాధపడుతున్న రోగులకు తన వంతు సాయం చేశానని చెబుతూ లేఖలో పేర్కొన్నాడు. ఈ పిల్లోడి గొప్ప మనసుకు సీఎం స్టాలిన్ ఫిదా అయిపోయాడు. తాను సైకిల్ కొందామనుకున్న డబ్బును కరోనా రోగులకు ఇచ్చేయడంతో.. ఆ బాలుడికి సీఎం స్టాలినే సైకిల్ ఇప్పించాడు. మధురై నార్త్ ఎమ్మెల్యే కే థాళపతి వర్మన్ ఇంటికి చేరుకుని సైకిల్‌ను అందజేశారు. స్టాలిన్ కూడా బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు.
ஹரீஸ்வர்மன் என்ற சிறுவன் தனக்கு மிதிவண்டி வாங்குவதற்காக வைத்திருந்த உண்டியல் தொகையை #COVID19 தடுப்பிற்காக முதலமைச்சர் நிவாரண நிதிக்கு அனுப்பிய செய்தி கேட்டு நெகிழ்ந்தேன்.
— M.K.Stalin (@mkstalin) May 9, 2021
இத்தகைய உணர்வே தமிழகத்தின் வலிமை!
சிறுவனுக்கு மிதிவண்டி வாங்கிக் கொடுத்து தொலைபேசியில் அழைத்து வாழ்த்தினேன் pic.twitter.com/vNtWpj5SCe