తోటి మహిళా నాయకురాలిని అసభ్యంగా దూషించిన బీజేపీ నేత.. సస్పెండ్ చేసిన పార్టీ
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
చెన్నై: తోటి మహిళా నాయకురాలిని అసభ్యంగా దూషించిన బీజేపీ నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించింది. తమిళనాడు రాష్ట్ర ఓబీసీ విభాగం బీజేపీ నాయకుడు సూర్య శివ, ఆ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు డైసీ సరన్పై ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను నరికేందుకు గుండాలను పంపుతానని, ఆమె ప్రైవేట్ భాగాలు కోసి మెరీనా బీచ్‌లో పడేస్తానని హెచ్చరించారు. అంతేగాక ఆమెపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు కూడా చేశారు.
కాగా, ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆయనను ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేశారు.
మరోవైపు సస్పెండైన సూర్య శివ పార్టీ వాలంటీర్‌గా కొనసాగవచ్చని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సూచించారు. ఆయన ప్రవర్తనలో మార్పు వస్తే, పార్టీకి నమ్మకం కలిగితే పదవీ బాధ్యతలు తిరిగి వస్తాయని తెలిపారు. ఇలాంటి విషయాలను తమ పార్టీ తేలికగా తీసుకోదని చెప్పారు. కాగా, డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ కుమారుడైన సూర్య శివ, ఈ ఏడాది మేలో బీజేపీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

