చెన్నై: బంగారం స్మగ్లర్లు ఎన్నిసార్లు అధికారులకు పట్టుబడ్డా తమ తీరు మార్చుకోవడం లేదు. పట్టుబడినా కొద్ది ఇంకో కొత్త రీతిలో బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టుబడింది. యూఏఈ రాజధాని షార్జా నుంచి వచ్చిన ఓ 27 ఏండ్ల వ్యక్తిని అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. అతని పాయు నాళంలో 648 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది. దాంతో ఆ బంగారాన్ని వెలికి తీయించి సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Tamil Nadu: Air Customs, Chennai says it has recovered and seized 648 grams of gold paste packed in four capsules, from the rectum of a 27-year-old man who arrived at Chennai airport from Sharjah, United Arab Emirates pic.twitter.com/z701fgPN19
— ANI (@ANI) July 14, 2021