సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన దుగోంగ్.. తిరిగి నీటిలోకి పంపిన అధికారులు
Dugong | అరుదుగా అప్పుడప్పుడు మాత్రం ఈ భారీ సముద్ర ప్రాణులు సజీవంగా తీరం వైపు కొట్టుకొస్తాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని విల్లుండి తీర్థం బీచ్‌కు
రామేశ్వరం: తిమింగళాలు, సొరచేపలు, డాల్ఫిన్లు ఇలా ఏదో ఒక రకం సముద్ర జీవులు తరచుగా తీరంవైపు కొట్టుకొస్తుంటాయి. ఎక్కువగా వాటిలో మృత కళేబరాలే ఉంటాయి. కానీ అరుదుగా అప్పుడప్పుడు మాత్రం ఈ భారీ సముద్ర ప్రాణులు సజీవంగా తీరం వైపు కొట్టుకొస్తాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని విల్లుండి తీర్థం బీచ్‌కు ఓ దుగోంగ్ ప్రాణాలతో కొట్టుకువచ్చింది.
ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ, జలవనరుల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఒడ్డుకు వచ్చిన దుగోంగ్‌ను తిరిగి సముద్రంలోకి పంపించారు. దుగోంగ్‌లు సముద్ర క్షీరదాలు. సిరేనియా క్రమానికి చెందిన నాలుగు రకాల జీవజాతుల్లో ఇవి కూడా ఒకటి.
ఇవి చూడటానికి సిరేనియా క్రమంలోని సీల్స్ మాదిరిగానే కనిపిస్తాయి. కానీ సీల్స్ కావు. వీటిని సాధారణంగా సముద్రపు ఆవులు అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లోని సముద్ర జలాల్లో ఈ దుగోంగ్‌లు నివసిస్తున్నాయి. వీటి తోక డాల్ఫిన్ల తోకను పోలి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

