Tall monumental National Flag: దేశంలో మరో అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఆవిష్కృతం అయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎత్తయిన జాతీయ పతాకాలను నెలకొల్పారు. అంత్యంత ఎత్తయిన జాతీయ పతాకం అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఉన్నది. ఈ జాతీయ పతాకం ఎత్తు 360 అడుగులు. ఇలాంటి ఎత్తయిన పతాకాలు దేశంలో చాలాచోట్ల ఉన్నాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో ఎత్తయిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తవాంగ్ నగరంలోని ఎన్గంగ్పా (బుద్ధ పార్క్) వద్ద కొత్త జాతీయ పతాకాన్ని నెలకొల్పారు. ఈ మాన్యుమెంటల్ నేషనల్ ఫ్లాగ్ ఎత్తు 104 అడుగులు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ గురువారం సాయంత్రం ఈ ఎత్తయిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 10 వేల అడుగుల ఎత్తయిన శిఖరంపై ఈ జాతీయ పతాకం ఉన్నది. అక్కడి నుంచి చూస్తే తవాంగ్ సిటీ పూర్తిగా కనిపిస్తుందట. ఇది దేశంలో శిఖరాలపై నెలకొల్పిన రెండో ఎత్తయిన జాతీయ పతాకమని పెమా ఖండూ ట్వీట్ చేశారు.