న్యూఢిల్లీ: రాజ్‌పథ్‌లో ఇవాళ శకటాల ప్రదర్శన తన్మయత్వానికి గురి చేసింది. వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ కేంద్ర శాఖలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి. అత్యంత వైభవంగా ఆర్డీ పరేడ్‌లో శకటాలను ప్రదర్శించారు. ఆధాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ రాజ్‌పథ్‌పై శకటాన్ని ప్రదర్శించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో.. శ్రీఅరబిందో తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. ప్రవక్తగా, దార్శనికనేతగా అరబిందోను కీర్తించారు.
WATCH the Tableau of @MinOfCultureGoI in the Republic Day Parade at Rajpath in Delhi#RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3fIz pic.twitter.com/5PRnYjua0c
కేంద్ర విద్యాశాఖ కూడా ఓ శకటాన్ని ప్రదర్శించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విశిష్టితను తెలియచెప్పే రీతిలో శకటాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్రీయ శిక్షా నీతితోనే దేశాభిమానం పెరుగుతందన్న నినాదాన్ని వినిపించారు.
WATCH: Tableau of @EduMinOfIndia showcasing NEP in the Republic Day Parade at Rajpath in Delhi#RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3fIz pic.twitter.com/MmzRAkGZWD
పోస్టల్ శాఖ కూడా శకటాన్ని ప్రదర్శించింది. మహిళా సాధికారత గురించి ఆ శాఖ తెలియజెప్పింది. పోస్ట్ వుమెన్ గురించి శకటంలో ప్రదర్శించారు. టెక్నాలజీ, సాంప్రదాయం కలిస్తే పోస్టల్ సర్వీస్ ఎలా ఉంటుందో చెప్పారు.
WATCH: Tableau of @IndiaPostOffice: 75 Years@Resolve – Women Empowerment. It featured a Post Woman, equipped with a digital device and a postman’s bag; a perfect blend of technology & tradition. #RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3fIz pic.twitter.com/ALYv8pNtCa