న్యూఢిల్లీ:లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోతే, జనం మీద జమిలి ఎన్నికలను రుద్దకూడదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ చెప్పారు. ఆయన రాసిన పుస్తకం ‘ఇండియాస్ ఎక్స్పెరిమెంట్ విత్ డెమొక్రసీ : ది లైఫ్ ఆఫ్ ఏ నేషన్ త్రూ ఇట్స్ ఎలక్షన్స్’ ఆవిష్కరణ నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చే విధానంలో పారదర్శకత లేదన్నారు.
జమిలి ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థీ అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల వ్యయం తగ్గుతుంది