తిరువనంతపురం: యూట్యూబర్ టీఎస్ సంజూ(YouTuber Sanju) అలియాస్ సంజూ టెకీ .. డ్రైవింగ్ లైసెన్సును మోటారు వాహన శాఖ రద్దు చేసింది. యూట్యూబ్‌లో ఇటీవల అతను పోస్టు చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కారులో స్విమ్మింగ్‌పూల్‌ను తయారు చేసి రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలను అతను ఇటీవల వీడియోగా పోస్టు చేశారు. నెల రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో వివాదాస్పదమైంది. దీంతో అలప్పుజాకు చెందిన రోడ్డు రవాణా అధికారి యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్నది. స్విమ్మింగ్‌పూల్ కారు రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేశారు. కారును నడిపిన అతని ఫ్రెండ్ సూర్యనారాయణ డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేశారు. సంజూ వీడియో ఛానల్‌కు చెందిన పాత వీడియోలను కూడా ఆర్టీఏ అధికారులు వీక్షించారు. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన అంశంలో చర్యలు తీసుకున్నారు.