న్యూఢిల్లీ: జొమాటో ఫ్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన కొన్ని రోజులకే స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. తమ యాప్‌లోని ప్రతి ఆర్డర్‌కు రూ.14.99గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.17.58 (17 శాతం)కి పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఫుడ్ ఆర్డర్ల ధరలు పెరగనున్నాయి. స్విగ్గీ తాజా నిర్ణయంతో జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ల రుసుములు దాదాపు సమానం కానున్నాయి. ర్యాపిడో సంస్థ బెంగళూరులో సొంతంగా ప్లాట్‌ఫామ్ ఫీజులు లేకుండా ఆహార బడ్వాటా సేవలను కస్టమర్లకు అందిస్తున్నది. మార్కెట్లో జొమాటో నుంచి స్విగ్గీకి గట్టి పోటీ ఎదురవుతున్నది. ఈ తరుణంలో ప్లాట్‌ఫామ్ ఫీజులు పెరగడం గమనార్హం.