Swati Maiwal case | స్వాతి మాలివాల్‌పై దాడి కేసు.. బిబవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Swati Maiwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిబవ్ కుమార్ పోలీస్ కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. బిబవ్ కుమార్‌కు గతంలో విధించిన ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు నిందితుడిని ఇవాళ తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు.
Swati Maiwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిబవ్ కుమార్ పోలీస్ కస్టడీని కోర్టు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బిబవ్ కుమార్‌కు గతంలో విధించిన ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు నిందితుడిని ఇవాళ తీస్ హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు.
కేసుకు సంబంధించి నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు బిబవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మే 28న బిబవ్ జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.
కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో కేజ్రీవాల్ పీఏ బిబవ్కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆప్ ఎంపీ స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బిబవ్ను ఈ నెల 18 అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ్టితో ఆ కస్టడీ ముగియడంతో పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది.
#WATCH | AAP MP Swati Maliwal assault case: Delhi CM Arvind Kejriwal’s aide Bibhav Kumar brought to Tis Hazari Court after the end of his police custody
He was arrested on May 18. pic.twitter.com/PQltYovGeS
— ANI (@ANI) May 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

