Vijay Sethupathy | విలక్షణ తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు హీరోగా.. మరోవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ నటుడు. అయితే విజయ్ తాజాగా నటించిన చిత్రం మహారాజ. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా మూవీ చూసిన ప్రేక్షకులందరూ సూపర్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమా ఇంటర్వ్యూలో పాల్గోన్న విజయ్ సేతుపతి తనకు విఘ్నేశ్ శివన్‌కు మధ్య ఉన్న వివాదం గురించి స్పందించారు.
విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన చిత్రం నానుమ్ రౌడీ తాన్ (నేను రౌడీనే). ఈ సినిమాకు
నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా షూటింగ్లో విజయ్‌కు విఘ్నేశ్ కి మధ్య గొడవ పడినట్లు తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ మొదటిరోజు నువ్వు నాకు యాక్టింగ్ నేర్పుతున్నావా నేను చేసేది నీకు అర్థం అవ్వడం లేదంటూ విఘ్నేశ్‌పై గట్టిగా అరిచాను. అయితే ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత నయనతార వచ్చి ఇద్దరికి సర్దిచెప్పింది. విక్కీ ఈ సినిమా స్క్రిప్ట్ నాతో చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. కానీ షూటింగ్ సమయంలో విక్కీని అర్థంచేసుకోలేక పోయాను. కానీ తర్వాత మెళ్లిగా అలవాటు అయ్యాడంటూ విజయ్ చెప్పుకోచ్చాడు. ఇక ఈ చిత్రం అనంతరం వీరి ముగ్గురి కాంబినేషన్లో కాతువాకుల రెండు కాదల్ (Kaathuvaakula Rendu Kaadhal) అంటూ 2022 లో మరో చిత్రం వచ్చింది.