Double iSmart | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజం అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ రేసులోకి మరో స్టార్ హీరో వచ్చి చేరాడు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. దీంతో పుష్ఫ మూవీ విడుదల వాయిదా పడుతుందని వస్తున్న వార్తలకు బలం చేకురినట్లయింది.
Maammmaaaaa! Date block kar!!
– Ustaad #Doubleismart Shankar pic.twitter.com/7LQEeu3dVK
— RAm POthineni (@ramsayz) June 15, 2024