ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది. (Police Files FIR) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేష్ పాండిల్కర్ జూన్ 4న గోరేగావ్‌లోని కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లారు. భారత్ జన్ ఆధార్ పార్టీ అభ్యర్థి అరోరా సురీందర్ మోహన్ దీనిపై వాన్రాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువైన మంగేష్ పాండిల్కర్తోపాటు పోలింగ్ సిబ్బంది దినేష్ గురవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, శివసేన (యూబీటీ) అభ్యర్థి అమోల్ కీర్తికర్ కూడా కౌంటింగ్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ గెలుపును బాంబే హైకోర్టులో సవాలు చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువైన మంగేష్ పాండిల్కర్‌పై ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.