కేరళ సీఎం విజయన్‌పై స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు..!
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది.
స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన యూఏఈ జాతీయుడు జూన్ 30న కేరళకు చేరుకోగా, జూలై 4న సీఐఎస్ఎఫ్ అరెస్టు చేసింది. యూఏఈ కాన్సులేట్ అధికారుల నుంచి తనకు కాల్ వచ్చిందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపింది. తాను సీఎం కార్యదర్శి శివశంకర్‌రెడ్డితో మాట్లాడి మొత్తం విషయాన్ని చెప్పానని, ఆయన విజయన్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు.
ఆ తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు విడుదల చేశారని.. మళ్లీ ఈ విషయంలో విచారణ జరుగలేదని స్వప్నా ఆరోపించారు. అనుమానాస్పదంగా ఉన్న విదేశీ వ్యక్తికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పటికే కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్నా సురేష్. ఈ కేసులో ఇటీవల ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం ప్రమేయం ఉందంటూ ఆరోపించిన విషయం విధితమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

