గౌహతి: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. చైనా తయారీ డ్రోన్ కలకలం రేపింది. (Suspicious Drone) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని చోరాకురి ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. ఒక ఇంటి పైభాగంలో ఎగురుతున్న నల్ల రంగు డ్రోన్‌ను గుర్తించిన స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడకు చేరుకుని ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్ ఇన్ చైనా అని డ్రోన్‌పై ఉన్నట్లు గుర్తించారు. దేశ సరిహద్దు దాటి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న చైనా డ్రోన్‌ను విశ్లేషిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తరుణంలో ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.