Maharashtra | మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు కలకలం.. పోలీసులు హై అలర్ట్
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) సముద్రతీరంలో ఓ విదేశీ బోటు (Suspicious boat) కలకలం రేపుతోంది.
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) సముద్రతీరంలో ఓ విదేశీ బోటు (Suspicious boat) కలకలం రేపుతోంది. రాయ్‌గఢ్ (Raigad) జిల్లాలోని రేవ్దండాలో గల కొర్లై తీరం సమీపంలో అనుమానాస్పద బోటును భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు తీర ప్రాంతంలో భద్రతను పెంచారు.
రేవ్‌దండాలోని కొర్లై తీరానికి (Revdanda coast) రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించింది. పడవకు పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్లు సమాచారం. అది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద పడవ గురించి సమాచారం అందుకున్న రాయ్‌గఢ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందంతో అక్కడికి చేరుకొన్నారు. నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది కూడా తీరానికి చేరుకున్నట్లు రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు.
ఈ అనుమానాస్పద పడవ ఘటన ముంబై ఉగ్రదాడి ఘటనను గుర్తు చేస్తుండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది హై అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంతోపాటు రాయ్‌గఢ్ జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు ముందుజాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు అనుమానాస్పద పడవ నుంచి రెడ్‌లైట్ వస్తున్నట్లు గుర్తించారు. భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Jyoti Malhotra | కేరళ పర్యాటక ప్రచారంలో జ్యోతి మల్హోత్రా..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

