న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు, భూతాపంతో వస్తున్న మార్పులు దేశంలోని 91శాతం మందిపై ప్రభావం చూపుతున్నట్టు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తీవ్రమైన వేడిగాలులు, భీకరమైన వర్షాలు, వరదలు, నీటి కొరతకు గురయ్యామని అనేక మంది భారతీయులు ‘ఇండియా క్లైమేట్ ఒపీనియన్ మ్యాప్స్’ సర్వేలో చెప్పారు.
భారతదేశం అంతటా అస్తవ్యస్తమైన రుతుపవనాలు, వరదలు, కరువులు చూపుతున్న తీవ్ర ప్రభావాలను నివేదిక హైలైట్ చేసింది.