రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, దంతెవాడలో పోలీసులు ఘన విజయం సాధించారు. చాలా సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న మహిళా నక్సలైట్‌తో పాటు మరో వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరు అనేక ఘటనల్లో పాలు పంచుకున్నారు. సుక్మా జిల్లాలో లొంగిపోయిన మహిళా నక్సలైట్‌కు రూ.2లక్షలు, దంతెవాడలో లొంగిపోయిన మావోయిస్టుకు రూ.లక్ష రివార్డును పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిద్దరు మావోయిస్టు సంస్థపై విసుగు చెంది.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఇద్దరి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు పేర్కొన్నారు.
సుక్మాలో పూనా నార్కోమ్ (కమ్ బ్యాక్ హోమ్) క్యాంపెయిన్ కింద మీన్పా, టేకెల్గూడ, బుర్కాపాల్‌లో జరిగిన ఘటనల్లో పాల్గొనగా.. ఆమె తలపై రూ.2లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఆమె కొంటా ఏరియా కమిటీలో చురుగ్గా పని చేసిన ఆమె.. పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేశారు. దంతెవాడలో లొంగిపోయిన సోమ్ది 12 సంవత్సరాలు నక్సలైట్ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. బుర్కాపాల్, టేకెల్గూడ, మీన్పా జరిపిన దాడుల్లో 61 మంది సైనికులు వీరమరణం పొందారు. ఆయా ఘటనల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బలగాల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో నక్సలైట్లు లొంగిపోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో లొంగుబాట పడుతున్నారు.