జాతీయోద్యమ మితవాద నాయకుల్లో ప్రముఖుడైన సురేంద్రనాథ్ బెనర్జీకి ఎన్నో బిరుదులున్నా సురేంద్ర ‘నాట్’ బెనర్జీగానే ప్రసిద్ధుడయ్యారు. గాంధీని వెన్నంటి ఉంటూనే ఉన్నట్టుండి ఆయన విధానాలనే వ్యతిరేకంచేవారు. అందుకే ఆయనకు ఆ పేరొచ్చింది. ఇంగ్లిష్‌లో ‘నాట్’ అంటే ముడి అని అర్థం. తంపులు పెడుతున్నాడని ఆయనకు ‘నాట్’ తగిలించారు.
ఖిలాఫత్, సహాయనిరాకరణ ఉద్యమాల విషయంలో గాంధీతో విభేదించారు. 1917లో మాంటెగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల విషయంలో కాంగ్రెస్ నేతలతో విభేదించి ‘నేషనల్ లిబరల్ పార్టీ’ని స్థాపించారు. బెంగాల్ మొదటి ఎన్నికల్లో గెలిచారు. ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వంలో చేరినందువల్ల ఎన్నో విమర్శలు ఎదుర్కొ న్నారు. కర్జన్ చేసిన ‘కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని’ మంత్రిగా ఉండి రద్దు చేయించారు. అందుకే ఆయన ‘సురేంద్ర నాట్’గానే ప్రసిద్ధుడయ్యారు.