సోమవారం 08 మార్చి 2021
National - Jan 19, 2021 , 09:46:17

సూరత్‌ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్‌ సీఎం సంతాపం

సూరత్‌ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్‌ సీఎం సంతాపం

గాంధీనగర్‌ :  గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి 15 మంది రాజస్థాన్‌లోని బన్స్‌వార జిల్లాకు చెందిన 15 మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంచారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి  జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియో ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. గుజరాత్‌ ప్రభుత్వం సైతం బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రుపాని ప్రకటించారు. ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo