Supriya Shrinate : బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె సంచలన ఆరోపణలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఆరెస్సెస్ సభ్యులు శంతను సిన్హా వెల్లడించారని పేర్కొన్నారు.
అమిత్ మాల్వియా కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలనే మహిళలపై వేధింపులకు వేదికగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. మహిళలకు న్యాయం చేయాలని తాము కాషాయ పార్టీని కోరుతున్నామని అన్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాన స్వీకారం చేసి 24 గంటలు గడవకముందే బీజేపీకి చెందిన ప్రముఖ నేత, ఐటీ సెల్ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని అన్నారు. అమిత్ మాల్వియాను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రియా శ్రీనటె డిమాండ్ చేశారు. ఆయన పదవిలో కొనసాగితే స్వతంత్ర విచారణ సాధ్యం కాదని అన్నారు. మాల్వియాను పదవి నుంచి తొలగించనంతవరకూ బాధితులకు న్యాయం జరగదని ఆమె పేర్కొన్నారు.
Read More :
Sonakshi Sinha | పెళ్లి పీటలెక్కబోతున్న హీరామండి నటి..!