న్యూఢిల్లీ : విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలూ భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై తగిన కార్యాచరణ చేపట్టడానికి బోర్డు అధ్యక్షుడికి అధికారాలు ఇచ్చింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఉమ్మడి పౌర స్మృతిపైనా కోర్టులో పిటిషన్ వేయాలని బోర్డు నిర్ణయించింది. మనోవర్తిపై కోర్టు తాజా తీర్పు ఇస్లామిక్ చట్టానికి(షరియా) వ్యతిరేకంగా ఉందని సమావేశం తీర్మానించింది.