న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్‌ల తో సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి ఈ నెల 16న విచారించనున్నట్టు సర్వోన్నత న్యా యస్థానం తెలిపింది. ఒక పార్లమెం టు నియోజకవర్గంలోని ప్రతి అసెం బ్లీ సెగ్మెంట్ నుంచి ర్యాండమ్‌గా ఎం పిక చేసిన ఐదు ఈవీఎంల నుంచి మాత్రమే స్లిప్పులను లెక్కించే ప్రస్తు త పద్ధతికి విరుద్ధంగా ఎన్నికల్లో పో లైన వీవీపాట్ స్లిప్పులను పూర్తిగా లె క్కించాలని కుమార్ అగర్వాల్ దాఖ లు చేసిన పిటిషన్ పై అభిప్రాయం చెప్పాలంటూ ఈనెల 1న ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వా న్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా గే, ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అ భ్యర్థనను వచ్చే వారానికి వా యిదా వేసింది.