Supreme Court | న్యూఢిల్లీ, మే 17: సమాజ నైతికత క్షీణిస్తున్న కారణంగా ఈ రోజుల్లో నిజం వైపు నిలబడేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2017లో జరిగిన భివాండి కార్పొరేటర్ హత్య కేసులో మౌఖిక వాంగ్మూలం కోసం పెద్ద సంఖ్యలో సాక్షులపై ఎందుకు ఆధారపడాల్సి వస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కాంగ్రెస్ కార్పొరేటర్ హత్య కేసు ప్రధాన కుట్రదారు ప్రశాంత్ భాస్కర్ మాత్రే బెయిల్ దరఖాస్తుపై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో సాక్షులకు రక్షణ ఇచ్చే వ్యవస్థ లేదు’ అని ధర్మాసనం తెలిపింది. ‘మీ విచారణ త్వరగా ముగియాలని మాత్రమే ఆశిస్తున్నామని’ పేర్కొంది.