న్యూఢిల్లీ: ‘ఉన్నావ్ రేప్’ కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం నిలిపేసింది. పోక్సో చట్టం ప్రకారం ‘పబ్లిక్ సర్వెంట్’కు నిర్వచనంపై అస్పష్టత ఉందని తెలిపింది.
సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, సెంగార్ ఆధిపత్యం చలాయించే స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఆయన బాధితురాలి తండ్రిని హత్య చేసినట్లు, పోక్సో చట్టం ప్రకారం దోషి అని నిర్ధారణ అయిందన్నారు. బాధితురాలు మాట్లాడుతూ, సెంగార్‌కు విధించిన జీవిత ఖైదును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సెంగార్‌కు మరణశిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని చెప్పారు.