Supreme Court | న్యూఢిల్లీ : ఓటీటీ కంటెంట్‌లో అశ్లీలతను నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా, జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ, ‘శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోకి మేం చొరబడుతున్నామని ఆరోపణలు వస్తున్నాయి. ఇది మా పరిధిలో లేదు. మీరే ఏదో ఒకటి చెయ్యండి’ అని వ్యాఖ్యానించారు.
అశ్లీల, లైంగిక కంటెంట్‌ను ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడాన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరారు. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతరులను కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేసింది.