Supreme Court: ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేస్తాం.. పతంజలి కంపెనీకి సుప్రీం వార్నింగ్
Supreme Court: హెర్బల్ ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేస్తే, ఆ ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేస్తామని సుప్రీంకోర్టు ఇవాళ పతంజలి కంపెనీకి వార్నింగ్ ఇచ్చింది. తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం అవుతాయని చెబుతూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు చేస్తోంది. దీన్ని తప్పుపడుతూ ఐఎంఏ కోర్టులో కేసు వేసింది.
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి కంపెనీకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేయవద్దు అని కోర్టు తెలిపింది. తప్పుదోవ పట్టించే రీతిలో ఉత్పత్తులపై చేసే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని పతంజలి కంపెనీని ఆదేశించింది. ఉత్పత్తులపై ఎటువంటి సమాచారం ఉన్నా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. జస్టిస్ హసనుద్దిన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటీషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం అవుతాయని పతంజలి కంపెనీ కొన్ని ఉత్పత్తులపై ప్రింట్ చేస్తోంది. ఆ విధానాన్ని కోర్టు తప్పుపట్టింది. వ్యాక్సినేషన్, ఆధునిక మెడిసన్ గురించి రాందేవ్ కంపెనీ చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ కోర్టును ఆశ్రయించింది.
ఆ కేసులో ఆగస్టు 23వ తేదీన కేంద్ర ఆరోగ్యశాఖ, ఆయుష్ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తులపై వ్యాధులు నయం అవుతాయని రాస్తే, అప్పుడు ఆ ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేయనున్నట్లు కోర్టు వార్నింగ్ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

