న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: లైంగికదాడి బాధితులు తమ అవాంఛిత గర్భాన్ని తొలగించుకొనేందుకు అనుమతించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. లైంగికదాడి కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే దానిని ఏ సమయంలోనైనా తొలగించేలా చట్టంలో మార్పులు చేయాలని పేర్కొంది.
20 వారాలు దాటిన తరువాత కూడా అవాంఛిత గర్భాన్ని తొలగించుకొనేందుకు బాధితులకు అనుమతించేలా చట్టాన్ని సవరించాలని సూచించింది. ఓ 15 ఏండ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో ఇంతకుముందు ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖాన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.