Supreme Court | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తాను చేపట్టే అన్ని కేసుల విచారణను త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు ప్రణాళికలు రూపొందిస్తున్నది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ధర్మాసనాల ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే యాప్‌ను పరీక్షిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాసనం ప్రొసీడింగ్స్‌ను 2022 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే నెల క్రితం సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి సైబర్ భద్రతను పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.