ఆధునిక సమాజంలో ఎలా అనుమతించగలం?.. తలాక్-ఎ-హసన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్' అనే ట్రిపుల్ తలాక్ పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పురుషుడు వరుసగా మూడు నెలలపాటు నెలకు ఒకసారి తలాక్ అని చెప్పి తన భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.
న్యూఢిల్లీ : ముస్లింలలో విడాకుల అంశాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) మరోమారు పరిశీలిస్తున్నది. ‘తలాక్-ఎ-హసన్’ (Talaq-e-Hasan) అనే ట్రిపుల్ తలాక్ (Triple Talaq) పద్ధతి చట్టబద్ధతను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. ఈ పద్ధతి ప్రకారం ఒక ముస్లిం పురుషుడు వరుసగా మూడు నెలలపాటు నెలకు ఒకసారి తలాక్ అని చెప్పి తన భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. ముస్లింలలో ట్రిపుల్ తలాక్ (తలాక్-ఎ-బిద్దత్)ను ఎనిమిదేండ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే ట్రిపుల్ తలాక్‌లో మరో రూపమైన ‘తలాక్-ఎ-హసన్’ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు బుధవారం విచారించింది.
‘ఆధునిక సమాజంలో దీనిని ఎలా అనుమతిస్తున్నారు?’ అని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. విడాకుల ప్రక్రియలో మాజీ భర్త సంతకం చేయకపోవడంతో తన బిడ్డ స్కూల్ అడ్మిషన్ కోసం ఒక ముస్లిం మహిళ ఇబ్బందులు పడుతున్న కేసును కూడా కోర్టు ప్రస్తావించింది. మతపరమైన ఆచారం ప్రకారం తలాక్ జరగాలంటే నిర్దేశించిన ప్రక్రియ మొత్తాన్ని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంటూ, తన హక్కుల కోసం పోరాడుతున్న ఆ మహిళను అభినందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

