న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra)ను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు స్వీకరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఆ పిటీషన్ స్వీకరించింది. ఈ కేసును జనవరి మూడవ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మహువా ఫైల్‌ను స్టడీ చేసేందుకు సమయం పడుతుందని కోర్టు చెప్పింది. పార్లమెంటరీ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు ఎంపీ మహువా ఆరోపించారు.
డిసెంబర్ 8వ తేదీన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ రిపోర్టును ఇచ్చింది. సుమారు 8 వారాల పాటు ఈ కేసులో విచారణ జరిగింది. లాయర్ జై అనంత్ దెహద్రాయి, బీజేపీ నేత నిశికాంత్ దూబేలను కూడా విచారించారు. అన్ని రూల్స్ బ్రేక్ చేసి ప్రివిలేజ్ కమిటీ తనను విచారించినట్లు మహువా ఆరోపించారు.