ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?
‘ఈగను చంపడానికి భారీ సుత్తిని ఉపయోగించ కూడదు’ అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు .. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో మెట్రో సర్వీసులు, ఇతర రైళ్లపై ప్రభుత్వం అనూహ్య ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించింది.
- మెట్రో సర్వీసులను పూర్తిగా మూసివేయడం సరికాదు
- కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
- ఆంక్షలను పునఃపరిశీలించాలని సూచన
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : ‘ఈగను చంపడానికి భారీ సుత్తిని ఉపయోగించ కూడదు’ అని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు .. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో మెట్రో సర్వీసులు, ఇతర రైళ్లపై ప్రభుత్వం అనూహ్య ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించింది. ఆందోళన కారణంగా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్లను మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ నెల 10న సీజేపీ ఆందోళనను పురస్కరించుకుని మెట్రో, రెగ్యులర్ రైలు సర్వీసులను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సుప్రీంలో సవాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీం మెట్రో, ఇతర రైళ్లపై పూర్తి ఆంక్షలు ఉండరాదని ఆదేశించింది.
ప్రజలు నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లడానికి మెట్రోలు, రైళ్లను ఆశ్రయిస్తుంటారని, కాబట్టి వాటిపై పూర్తిగా నిషేధం విధించడంపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఈ ఆంక్షలను పునః పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఆంక్షలు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తాయని, నిరసన తెలిపే హక్కుకు, ఇతర పౌరుల హక్కులకు మధ్య సమతుల్యతను పాటించాలని కోర్టు సూచించింది. మూసివేసిన రోడ్డు మార్గాలను తెరిచే విషయాన్ని కూడా పునరాలోచించాలని ఆదేశించింది. యువత, వృద్ధులు అందరికీ ప్రాథమిక సౌకర్యాలు పొందే హక్కు ఉందని, లక్షలాది మంది నిత్యం గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలకు ఉపాధి, విద్య, ఇతర పనుల కోసం వెళ్తారని, అందరికీ కార్లు ఉండవని, వారి ప్రయాణానికి మెట్రో, రైళ్లే ఆధారమని తెలిపింది. ఆంక్షలకు, పూర్తి నిషేధానికి మధ్య తేడా ఉందని వ్యాఖ్యానించిన సుప్రీం.. రైళ్ల ఫ్రీక్వెన్సీని ప్రభుత్వం తగ్గించవచ్చునని, అయితే వాటిని పూర్తిగా రద్దు చేయడం సబబు కాదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

