న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు .. సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువునష్టం కేసులో ఎంపీ శశిథరూర్‌పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. శివలింగంపై తేలు అని ప్రధాని మోదీని విమర్శించిన కేసులో అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పరువునష్టం కేసులో విచారణ నిలిపివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ ఆదేశాలను ప్రశ్నిస్తూ ఎంపీ శశిథరూర్ అత్యున్న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేసిన కేసులో.. ఎంపీ శశిథరూర్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఆ క్రిమినల్ కేసులో 2019లో ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు రాజీవ్ బబ్బర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.