న్యూఢిల్లీ: కుల వివక్ష కలిగిన సుమారు 11 రాష్ర్టాల జైళ్ల నియమావళులను సుప్రీంకోర్టు గురువారం పక్కన పెట్టింది. కులాల ఆధారంగా ఖైదీలకు ప్రత్యేక వార్డులు, పనులు కేటాయించే పద్ధతిని నిరాకరించింది. వివక్షను నిరోధించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపింది. ‘ఇలాంటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం. రాష్ర్టాలు తమ జైళ్ల నియమావళుల్లో మార్పులు చేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది.