న్యూఢిల్లీ: సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు సుప్రీంకోర్టు(Supreme Court) నో చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల వివాహం చల్లుబాటు కాదు అని కోర్టు తెలిపింది. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతనే ఆ జంటలకు హక్కు ఉంటుందని కోర్టు వెల్లడించింది. సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 3-2 తేడాతో దత్తత హక్కులపై ధర్మాసనం తీర్పును వెలువరించింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్లు .. స్వలింగ సంపర్కులు దత్తత తీసుకోవచ్చు అని వెల్లడించారు. జస్టిస్ రవీంద్ర భట్, పీఎస్ నర్సింహా, హిమా కోహ్లీలు దత్తత హక్కులను వ్యతిరేకించారు.