న్యూఢిల్లీ: మహిళలకు ఉన్న ప్రత్యుత్పత్తి హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమని సుప్రీంకోర్ట్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా మహిళలకు ఉన్న ప్రసూతి సెలవుల హక్కులను హరించలేదని తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి ప్రసూతి సెలవులు నిరాకరించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
పసూతి సెలవును ఇప్పుడు ప్రాథమిక పునరుత్పత్తి హక్కుల్లో భాగంగా గుర్తిస్తామని తెలిపింది. తనకు మొదటి పెండ్లి కారణంగా ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అయితే దాన్ని సాకుగా చూపి తనకు రెండో పెండ్లి వల్ల కలిగిన గర్భధారణకు అవసరమైన ప్రసూతి సెలవులను ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిందని పిటిషనర్ కేసు వేశారు. తాను రెండో పెండ్లి చేసుకొన్నాకే ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని ఆమె వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పిటిషనర్‌కు మద్దతిచ్చింది.