న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రతి నెలా ఒకటో, మూడో శనివారాల్లో ప్రజలు సుప్రీంకోర్టును సందర్శించవచ్చు. అయితే, ఆ రోజుల్లో ప్రభుత్వ సెలవులు ఉంటే ఈ అవకాశం ఉండదు. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ఈ భవనంలోని ప్రతి విభాగం గురించి, దాని చారిత్రక విశిష్టత గురించి అధికారులు తెలియజేస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకెళ్లి, చూపిస్తారని తెలిపారు. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తప్పనిసరి.