డిజిటల్ మోసాల బాధితులకు బ్యాంకులు పరిహారం చెల్లించాల్సిందే
డిజిటల్ మోసాల బాధితులు నష్టపోతే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. బాధితులను రక్షించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలదేనని కోర్టు పేర్కొంది. తగిన శ్రద్ధ వహించడంలో బ్యాంకులు విఫలమవ్వడం వల్ల మోసం జరిగినట్టు రుజువైతే డిజిటల్ అరెస్టు స్కామ్‌ల వంటి నేరాల బాధితులకు కనీసం వారు కోల్పోయిన మొత్తానికైనా పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తెలిపింది.
- బ్యాంకుల నిర్లక్ష్యం ఉన్నట్టు రుజువైతే బాధితులు కోల్పోయిన మొత్తాన్నైనా చెల్లించాలి
- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- డిజిటల్ అరెస్టులకు విద్యావంతులూ మోసపోతుండటంపై ఆందోళన
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: డిజిటల్ మోసాల బాధితులు నష్టపోతే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. బాధితులను రక్షించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలదేనని కోర్టు పేర్కొంది. తగిన శ్రద్ధ వహించడంలో బ్యాంకులు విఫలమవ్వడం వల్ల మోసం జరిగినట్టు రుజువైతే డిజిటల్ అరెస్టు స్కామ్‌ల వంటి నేరాల బాధితులకు కనీసం వారు కోల్పోయిన మొత్తానికైనా పరిహారం చెల్లించాలని న్యాయస్థానం తెలిపింది.
ఖాతాదారుని నిర్ధారిత లావాదేవీల సరళికి భిన్నంగా ఉండే అసాధారణ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను స్వయంచాలకంగా సమాచారం అందచేయడం, లావాదేవీల ప్రామాణికతను నిర్ధారించడానికి భౌతిక ధృవీకరణ వంటి తప్పనిసరి నివారణ చర్యల ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది.
బాధితులను రక్షించడం బ్యాంకర్లుగా మీ బాధ్యత. మరి మీ అధికారిక వ్యవస్థ ఏం చేస్తున్నది? అని సీజేఐ ప్రశ్నించారు. బహుశా పెద్ద కంపెనీలకు సంబంధించిన లావాదేవీలను మీరు గుర్తించలేకపోవచ్చు. కానీ సాధారణంగా ఒకసారికి రూ.10,000 లేదా రూ.20,000 మాత్రమే విత్‌డ్రా చేసే వ్యక్తి అకస్మాత్తుగా రూ.50,000 విత్‌డ్రా చేసినప్పుడు ఆ లావాదేవీని గుర్తించకూడదా? అని ఆయన ప్రశ్నించారు. స్వయంగా చేపట్టిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ జరుపుతున్నప్పుడు ఆర్థిక సంస్థలు తగిన శ్రద్ధ చూపడంలో, బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్టు తేలితే ప్రతిపాదిత నియంత్రణ చట్టం బాధితులకు తగిన పరిహారం అందించేలా ఉండాలని ధర్మాసనం నొక్కిచెప్పింది.
డిజిటల్ అరెస్టులపై అసంతృప్తి
డిజిటల్ అరెస్టు మోసాలు కొనసాగుతుండటంపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యావంతులైన పౌరులు కూడా ఇలాంటి మోసాలకు ఎలా బలి అవుతున్నారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. డిజిటల్ అరెస్టుల విషయంలో వీరు దేనికి భయపడుతున్నారు? ఇది ఒక రకమైన భయాందోళన స్థితి. ప్రజలు ఇలా ఎలా చిక్కుకుపోతున్నారు? ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్టు చేశాం అని చెబితే దాన్ని మీరు నిజమని ఎలా నమ్మేస్తున్నారు? మన దేశంలో ఇలాంటి మోసాలకు ప్రజలు ఎలా బాధితులు అవుతున్నారు? ఇక రాబోయే తరాలకు మీరు ఏమి అందించగలరు? అని సీజేఐ ప్రశ్నించారు.
తదుపరి విచారణ తేదీ నాటికి అన్ని అధికారిక ఆర్థిక సంస్థల జాబితాను సమర్పించాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, వ్యక్తిగత బ్యాంకులను విడిగా ఈ విచారణ ప్రక్రియలో భాగం చేయాల్సిన అవసరం లేకుండానే అన్ని సంస్థలకు వర్తించేలా ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. ప్రతిపాదిత మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల వివరాలను, బాధితులకు నష్టపరిహారం అందించడానికి పరిశీలిస్తున్న చర్యలను కూడా ధర్మాసనం కోరింది. డిజిటల్ అరెస్టు మోసాల బాధితులుగా ఉండే అవకాశం ఉన్న కస్టమర్లకు సంబంధించిన అసాధారణ లావాదేవీల గురించి సమీపంలోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కూడా ధర్మాసనం నొక్కి చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

