HomeNationalSupreme Court Ruling On Governor Powers Will Be A Game Changer For Federal Disputes
చట్టాల రూపకల్పనను గవర్నర్లు అడ్డుకోలేరు
చట్టాల రూపకల్పన ప్రక్రియను గవర్నర్లు అడ్డుకోలేరని పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పు.. కేరళకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కేరళ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.
‘కేరళ వర్సెస్ గవర్నర్’ కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చట్టాల రూపకల్పన ప్రక్రియను గవర్నర్లు అడ్డుకోలేరని పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పు.. కేరళకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కేరళ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో కేంద్రం, కేరళ గవర్నర్ అడిషనల్ చీఫ్ సెక్రటరీకి సుప్రీం ఇంతక్రితమే నోటీసులు జారీచేసింది. కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘క్రితం రోజే పంజాబ్ విషయంలో మేం జారీచేసిన ఉత్తర్వులు వెబ్సైట్లో అప్లోడ్ చేశాం. దీనిని రిఫర్ చేయాలని గవర్నర్ అడిషనల్ సెక్రటరీని అడగండి’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచలేరని, బిల్లును ఆమోదించటమే లేదా పునఃసమీక్ష నిమిత్తం తిరిగి వెనక్కి పంపటమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.