 
                                                            న్యూఢిల్లీ : సాంకేతిక కారణాలను చూపి, రోడ్డు ప్రమాదాల బాధితులకు నష్ట పరిహారాన్ని బీమా కంపెనీలు నిరాకరించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదానికి కారణమైన వాహనానికి మంజూరైన పర్మిట్ రూట్ కాకుండా వేరొక మార్గంలో ఆ వాహనం ప్రయాణించిందని చెప్తూ, బాధితులకు పరిహారాన్ని చెల్లించే బాధ్యత నుంచి తప్పించుకోకూడదని తెలిపింది.
ఇటువంటి సాంకేతిక కారణాలతో పరిహారాన్ని నిరాకరించడం న్యాయ భావనకు విరుద్ధమని పేర్కొంది. బస్సు యజమాని కే నాగేంద్ర, ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన అపీళ్లను తోసిపుచ్చింది. ఈ రెండు అపీళ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జరిగిన ప్రమాదంలో మృతుని తప్పు లేదని పరిహారాన్ని చెల్లించాలని తెలిపింది.
 
                            