న్యూఢిల్లీ, అక్టోబర్9: సరగసీ వయోపరిమితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సరగసీ నియంత్రణ చట్టం-2021 అమల్లోకి రాకముందే సరగసీ ప్రక్రియ ప్రారంభించినవాళ్లకు వయోపరిమితులు వర్తించవని స్పష్టంచేసింది.
చట్టంలో పేర్కొన్న వయోపరిమితి దాటిన మూడు జంటలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. సరగసీ నియంత్రణ చట్టం-2021 అమల్లోకి రాకముందే సదరు జంటలు అండం భద్రపర్చడం, గర్భాశయానికి బదిలీ చేయడం వంటి ప్రక్రియలు ప్రారంభించినట్టు గుర్తించింది.