న్యూఢిల్లీ: విదేశీ నిధుల స్వీకరిస్తున్న సుమారు ఆరు వేల ఎన్జీవోలకు ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది. విదేశీ నిధుల అంశంలో రిలీఫ్ ఇవ్వాలంటూ ఆ ఎన్జీవోలు పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అమెరికాకుచెందిన గ్లోబల్ పీస్ ఇన్సియేటివ్ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను పునరుద్దురించాలని ఆ సంస్థ కోరింది. దీనిపై ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. ఎఫ్సీఆర్ఏ లైసెన్సు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కటాఫ్ తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న 11,594 ఎన్జీవోల అప్లికేషన్లను స్వీకరించినట్లు సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే దరఖాస్తు మరికొన్ని వారాల పాటు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఆ సమయంలో ధర్మాసనం తీర్పునిస్తూ.. తాత్కాలిక ఊరట ఇవ్వలేమని తెలిపింది.